ఇరాన్‌ అధ్యక్షుడికి ట్రంప్‌ హెచ్చరిక

0
133

వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్‌ దేశం ఇరాన్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికాను బెదిరించాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీని ట్విటర్‌లో హెచ్చరించాడు. పులితో ఆటలు వద్దని, ఇరాన్‌తో  యుద్ధమంటే అంత సులువైనది ​కాదని ఆదివారం హసన్‌ రోహనీ ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. హసన్‌ వ్యాఖ్యలపై ట్రంప్‌ ‍స్పందిస్తూ.. ‘అమెరికాను బెదిరించాలని చూడకండి. మీరు బెదిరిస్తే భయపడే దేశం కాదు మాది. అమెరికా ఎప్పటికి, ఎవరికి బయపడదు. మాజోలికి వస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామలు చూడాల్సి వస్తుంది. అమెరికాతో జాగ్రత్తగా వ్యవహరించడండి’ అంటూ ట్రంప్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

ఇరాన్‌ ఉగ్రవాదుల ముఠాకు సహకరిస్తోందన్న ఆరోపణలతో 2015లో ఇరాన్‌ న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా ఇరాన్‌పై ఆంక్షలు విధించి, రాజకీయంగా ఒత్తిడి తేచ్చేందుకు ‍ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇరాన్‌ యుద్దాలకు పుట్టినిళ్లలని.. ఇరాన్‌తో యుద్ధ అంతసులువైనది కాదని ఇటీవల రౌహనీ అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి