చైనాలో ఓ యువతి సమయస్పూర్తి

0
146

బీజింగ్‌ : చైనాలో ఓ యువతి సమయస్పూర్తి ఓ మనిషి ప్రాణాలను కాపాడగలిగింది. చైనాలోని జింజూ సమీపంలోని రైల్వే స్టేషన్‌లో 81 ఏళ్ల వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతోన్న ఓ యువతి వెంటనే స్పందించింది. వృద్ధుడిని పడుకోబెట్టి, అతని పై మోకాళ్ల మీద కూర్చుని రెండుచేతులనూ కలిపి బలంగా అతని ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కింది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించింది. ఇలా అరగంట పాటూ ఈ ప్రక్రియను కొనసాగించింది. సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సీటేషన్) ప్రక్రియ ద్వారా కుప్పకూలిన మనిషికి తిరిగి ప్రాణం పోసింది.

వృద్ధుడికి సీపీఆర్‌ విధానం ద్వారా ప్రాణం పోసిన యువతిని జింజూలోని మెడికల్‌ కాలేజీ స్టూడెంట్‌ డింగ్‌ హుయ్‌గా గుర్తించారు. వృద్ధుడి ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమైన డింగ్‌ హుయ్‌ ఇంటికి వెళ్లాల్సిన ట్రైన్‌ని కూడా మిస్సయింది. యువతి చూపిన చొరవకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి