శానిటరీ న్యాప్‌కిన్లపై పన్ను రద్దు.. మతలబేంటి?

0
135

న్యూఢిల్లీ : మహిళలు వాడే శానిటరీ న్యాప్‌కిన్లపై ప్రస్తుతం విధిస్తున్న 12 శాతం జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు జీఎస్టీ మండలి శనివారం ప్రకటించిన వెంటనే పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శానిటరీ న్యాప్‌కిన్ల ధర మార్కెట్‌లో తగ్గుతుందా? లేదా ? అన్నది ప్రస్తుత ప్రశ్న. తగ్గితే ఎంత తగ్గుతుంది ? పెరిగితే ఎంత పెరుగుతుంది? అన్నది కూడా ప్రశ్నే.

న్యాప్‌కిన్లపై వివిధ పన్నులు కలుపుకొని 13 శాతానికిపైగా పన్నులు పడుతుంటే తాము కేవలం 12 శాతం జీఎస్టీని విధించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించామంటూ 2017, జూలైలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వీడియో సాక్షిగా చేసిన వాదన ఎంత మేరకు కరెక్ట్‌ ? ఆ 12 శాతం జీఎస్టీని ఎత్తివేయడం వల్ల వినియోగదారుడికి ప్రస్తుతం కలిగే అదనపు ప్రయోజనం ఏమిటీ?

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి