అభిప్రాయం చెప్పటానికి ధైర్యం చాలటం లేదా ? అదేనా కారణం ?

0
387

ఏ విషయంపైన కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓ స్ధిర అభిప్రాయం ఉన్నట్లు లేదు. ఏదైనా ఓ విషయంపై తన అభిప్రాయం చెప్పాల్సొచ్చినపుడు కమిటీలని, నిపుణులని చెప్పి విషయాన్ని దాట వేయటం పవన్ కు మామూలైపోయింది. ఇదంతా ఇపుడెందుకంటే ? కాపుల రిజర్వేషన్ అంశం రాజకీయాలను ఎంతగా హీటెక్కిస్తోందో అందరికీ తెలిసిందే. మరి స్వయానా కాపు సామాజికవర్గానికే చెందిన పవన్ తన అభిప్రాయాన్ని చెప్పకపోతే ఎలా ?

నివేదిక తర్వాత అభిప్రాయం

అదే విషయమై పవన్ తాజాగా మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై న్యాయ, రాజ్యాంగ, మేధావులతో కూడిన కమిటీని వేయబోతున్నట్లు చెప్పారు. అంటే సదరు కమిటీ ఏర్పాటైన తర్వాత సమస్యపై అధ్యయనం చేస్తుందన్నమాట. ఆ తర్వాత తన నివేదికను పవన్ కు ఇస్తే దాన్ని మళ్ళీ పవన్ అధ్యయనం చేసి ఆ తర్వాత తన అభిప్రాయాన్ని చెబుతారట. ఇప్పటికే అర్ధమైఉంటుంది సమస్యపై పవన్ కు ఎంత క్లారిటీ ఉందో.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి