ఆర్‌బీఐ ఎఫెక్ట్‌.. మార్కెట్ల రికార్డులకు బ్రేక్‌

0
367


ఆర్‌బీఐ ఎఫెక్ట్‌.. మార్కెట్ల రికార్డులకు బ్రేక్‌ ముంబయి: దేశీయ మార్కెట్ల రికార్డుల పరుగుకు అడ్డుకట్ట పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటిదాకా స్వల్ప లాభాల్లో సాగిన సూచీలు సమీక్ష ఎఫెక్ట్‌తో నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో వరుసగా ఏడు రోజుల పాటు సరికొత్త గరిష్ఠాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. బుధవారం ఆ రికార్డుల నుంచి వెనక్కి వచ్చి నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో ఈ ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సూచీలు ఆద్యంతం ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక సమీక్ష నిర్ణయాలతో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో కుదేలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరకు 85 పాయింట్లు నష్టపోయిన సూచీ 37,522 వద్ద ముగిసింది.

అటు నిఫ్టీ కూడా స్వల్పంగా 10 పాయింట్ల నష్టంతో 11,346 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.51గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో కోల్‌ఇండియా, లుపిన్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడగా..

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి