కేంద్రమంత్రిని కలిసిన తెదేపా బృందం

0
314


కేంద్రమంత్రిని కలిసిన తెదేపా బృందం దిల్లీ: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో తెదేపా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఆ పార్టీ ఎంపీలు, కడప జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అంతకుముందు ఇదే అంశంపై తెదేపా బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసింది. ఉక్కు కర్మాగారంపై చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ విన్నవించింది. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి