తెరపై కర్ణాటక రెండో రాజధాని?

0
330


బెంగుళూరు: కన్నడనాటలో ఇప్పుడు ఉత్తర, దక్షిణ కర్ణాటక అంటూ చర్చ జరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రానికి రెండో రాజధాని డిమాండ్‌ మరోమారు తెరపైకి వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన మనోగతాన్ని బయటపెట్టారు. ఆ విషయం తమ దృష్టిలో ఉందని, బెలగవి సిటికి సువర్ణ విధాన సౌధకు చెందిన కొన్ని ప్రభుత్వ కార్యాలయానికి తరలించే ఆలోచన తమ ప్రభుత్వం పరిశీలనలో ఉందని చెప్పారు. నేను 12ఏళ్ల క్రితం దీనిపై సలాహా ఇచ్చాను. కాగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. బిజెపి ఇప్పుడు ఆ విషయం మాట్లాడుతోంది. 15-20 రోజుల్లో దీనిపై నేను ఓ ప్రకటన చేయబోతున్నాను. మంగళూరును ఆర్థిక రాజధానిగా మార్చాలన్నదే నా ఆలోచన అని కుమారస్వామి తెలిపారు. కుమారస్వామి జనతాదళ్‌(యునైటెడ్‌) 2006లో బిజెపితో కలిసి అధికారంలో ఉంది. కర్ణాటక రెండో రాజధానిగా బెలగవిని సూచిస్తూ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో నాడు ఆమోదించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి