మున్సిపల్‌ ఉద్యోగినిపై కమిషనర్‌ అత్యాచారయత్నం

0
407


ఎర్రగుంట్ల, జూలై 31 : ఎర్రగుంట్ల నగరపంచాయతీలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఓ మహిళపై కమిషనర్‌ టీఎన్‌.విజయసింహారెడ్డి మంగళవా రం అత్యాచారయత్నం చేసినట్లు కేసునమోదు అయింది. పోలీసుల కథనం మేరకు..కమిషనర్‌ విజయసింహారెడ్డి వలసపల్లెరోడ్డులో నివాసం ఉంటున్నారు. ఇంట్లో కసువు ఊడ్చేందుకు మంగళవారం ఓ మహిళా స్వీపర్‌ను మేస్త్రీ న రసింహారెడ్డి పంపాడు. ఇంట్లో కసువు ఊడుస్తుండగా వెనుకవైపు నుంచి కమిషనర్‌ పట్టుకున్నాడు. ఆమెను తనకు సహకరించమని కో రాడు. ఇందుకు ఏమికావాలన్నా ఇస్తానన్నాడు. ఆ మహిళ వెంటనే అతనినుంచి తప్పించుకు ని వచ్చింది. ఇతర కార్మికులకు ఈవిషయాన్ని తెలపగా కమిషనర్‌ కార్యాలయానికి రాగానే ప్రశ్నించారు. చైర్మన్‌ ముసలయ్య, వైస్‌చైర్మన్‌ సుభా్‌షరెడ్డి, కౌన్సిలర్లు ఆరా తీశారు. బాధితురాలిని పూర్తి విషయం తెలుసుకుని కేసు పె ట్టాలని సూచించారు. కేసు వద్దని ఇక్కడి నుం చి పంపించి వేయండి అని డిమాండ్‌ చేశారు. దీంతో కమిషనర్‌ ఎర్రగుంట్ల నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ మహిళ ను కూడా ఇంటికి పంపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి