రగడలతో రాజ్యసభ రేపటికి వాయిదా

0
252

న్యూఢిల్లీఃరాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అసోంలో జాతీయ పౌర రిజిస్ట్రేషన్‌ అంశంపై రాజ్యసభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు రెండోమారు మాట్లాడేందుకు రాజ్యసభ ఛైర్మన్‌ అవకాశం ఇవ్వడంతో రాజ్యసభలో రగడ చెలరేగింది. అమిత్‌షాకు రెండోమారు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై అభ్యంతర వ్యక్తం చేస్తూ తృణమూల్‌ సహా విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతో మొదట రెండు గంటల వరకు సభన వాయిదా వేసిన ఛైర్మన్‌ ముప్పవరపు వెంకయ్యనాయుడు తిరిగి సభ ప్రారంభమయ్యాకా కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అమిత్‌ షా తాను మాట్లాడనని ప్రకటించిన, కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మాట్లాడాల్సిందిగా ఛైర్మన్‌ ఆదేశించిన తర్వాత కూడా విపక్షాలు శాంతించలేదు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి