మహానగరం చుట్టూ ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు

0
136

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ మరో ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. బోడుప్పల్, ఫిర్జాదిగూడ, నిజాంపేట్, బండ్లగూడ, జవహర్‌నగర్, బడంగ్‌పేట్‌లను సమీప ప్రాంతాలను చేర్చి కార్పొరేషన్లుగా మార్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. వీటిపై ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు శాసనసభకు ప్రతిపాదనలు సమర్పించే అవకాశం ఉంది. మహానగరంలో కలిసిపోయినశివారు ప్రాంతాలను మున్సిపాలిటీలుగా కొనసాగించాలా లేక, జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలా అన్న అంశంపై కొద్ది రోజులుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఒక దశలో జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి శివారు ప్రాంతాలను విలీనం చేయాలన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. చివరకు కొత్తగా ఆరు కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్ల ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక నగరంలో పూర్తిగా కలిసిపోయిన మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్‌ తదితర ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి