ఇకపై పంచాయతీల్లో డిజిటల్‌ ‘కీ’ ద్వారా చెల్లింపులు

0
192

గ్రామ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ ‘కీ’ ద్వారా చెల్లింపులు జరిపేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గతంలో గ్రామ పంచాయతీల్లో వినియోగించిన నిధుల విడుదల చెక్కుల రూపంలో ఉండేది. కొన్ని చోట్ల పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు దుర్వినియోగం చేస్తుండటంతో ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు సస్పెండ్‌కు గురికావడం, విచారణను ఎదుర్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో అలాంటి అక్రమాలకు చెక్‌పెట్టి పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌‘కీ’ పేరుతో కొత్త విధానాన్ని రూపొందించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి