ఇటీవల కుల్భూషణ్ జాదవ్ కేసులో ఆ దేశం ఘోర పరాభావాన్ని చవిచూసింది. అయితే ఆ కేసును వాదించిన భారత్ తరఫు లాయర్ హరీష్ సాల్వే .. కేవలం నామమాత్రంగా రూపాయి ఫీజు తీసుకొని తన దేశభక్తిని చాటుకున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్ లాయర్ మాత్రం బీరాలు పోయారు. కానీ అతడు వసూల్ చేసిన ఫీజుపై సర్వత్రా చర్చ జరుగుతుంది.జాదవ్ ఉరిశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ వాదనలు వినిపించింది. తాము విధించిన శిక్ష సరైనదేనని పాక్ .. చెప్పాల్సి ఉంది. ఇందుకోసం పాకిస్థాన్లో ప్రముఖ లాయర్ ఖవార్ ఖురేసీని సంప్రదించింది. అతను కేసును వాదించారు. కానీ ఓడిపోయింది. ఇంతవరకు ఓకే కానీ అతను ఫీజు గురించే చర్చ జరుగుతుంది. జాదవ్ కేసులో వాదనలు వినిపించేందుకు అతను వసూల్ చేసింది ఎంతో తెలుసా.. అక్షరాల 20 కోట్లు. ఔను మీరు విన్నది నిజమే.