నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-2

0
343

కొద్ది గంటల్లో ప్రపంచ దేశాల చూపంతా భారత్‌వైపు ఉండబోతోంది. చంద్రుడి ఆవిర్భావం గురించి చంద్రమండలంపై విశేషాలను కనుగొనేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-2ను నింగిలోకి పంపనుంది. ఇందుకోసం ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల43 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ముఖ్య పాత్ర పోషించే ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను నింగిలోకి జీఎస్ఎల్‌వీ ఎంకే-3 రాకెట్ మోసుకెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం జూలై 15న తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు టేకాఫ్ తీసుకోవాల్సిన చంద్రయాన్-2 సాంకేతిక లోపం తలెత్తడంతో 22వ తేదీకి వాయిదా పడింది.ఇక మొత్తం 54 రోజుల పాటు చంద్రయాన్-2 ప్రయాణం ఉంటుంది. చంద్రుడిపై ఓ స్పేస్ క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలువనుంది. చంద్రయాన్ -2 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంలో జరిగే విషయాలను స్టడీ చేయనున్నారు. అక్కడే ఎక్కువగా నీటి ఆనవాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2008 అక్టోబర్ 22వ తేదీన చంద్రయాన్-1ను ఇస్రో నింగిలోకి పంపింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి