‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసింది!

0
164

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్ కు జోడీని రాజమౌళి ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఓ విదేశీ హీరోయిన్ అవసరం కాగా, తొలుత డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె వ్యక్తిగత కారణాలతో సినిమా నుంచి తప్పుకోగా, మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడిన రాజమౌళి, ఇప్పుడు అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఎమ్మాకు ఇదే తొలి భారతీయ చిత్రం. ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల నటి ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి