మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

0
74

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ (105) సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. మంత్రి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. వందేళ్ల వయస్సు దాటిన ఆమె వనపర్తిలోని మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలోనే ఇన్నాళ్లు ఉన్నారు. రోజూలానే ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించగా.. సోమవారం తెల్లవారుజామున ఆయాస పడుతూ కనిపించింది. మంత్రి ఆస్పత్రికి తరలిద్దామని ప్రయత్నిస్తుండగానే తుదిశ్వాస విడిచారు. మంత్రితోపాటు వారి చెల్లెళ్లు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి