బీజేపీ నిరుపేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది.బీజేపీ నేత ప్రహ్లాద్‌రావు

0
270

 

బీజేపీ నిరుపేదలకు ఎల్లప్పుడు అండగా ఉంటోందని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు తెలిపారు. కొన్నినెలల క్రితం ఉపాధి నిమ్మిత్తం దుబాయికి వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన సమీనాబేగంను ఆయన పార్టీ కార్యాలయంలో బుధవారం పరామర్శించారు. బతుకు దెరువు కోసం విదేశానికి వెళ్లిన ఆమె అక్కడి ఇంటి యజమానులతో నరకం అనుభవించింది. సమీనాబేగంతో ముందు తామే మాట్లాడి దుబాయ్‌లో ఉంటున్న బీజేపీ లీగల్‌ సెల్‌ అడ్వయిజర్‌ శ్రీనివాస్‌రావుకు సమాచారం అందించామని చెప్పారు. ఆయన సమీనాబేగం వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వం సాయంంతో ఇండియాకు రప్పించినట్లు వివరించారు. అనంతరం సమీనాబేగం తాను అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి