టిక్‌టాక్‌… ప్రపంచాన్ని ఊపేస్తున్న మాయా యాప్‌.

0
311

తమను తాము హీరోలుగా చేసుకునే కలల ప్రపంచం. ఇప్పటి ఆండ్రాయిడ్‌ యుగంలో 70శాతానికి పైగా ఫోన్లలో టిక్‌టాక్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఏదోఒక సినిమా పాటకు, సన్నివేశానికి వీడియో చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నారు. ఎక్కువ లైక్‌లు వస్తే.. టిక్‌టాక్‌కు బానిసలవుతున్నారు. కొందరైతే లైక్‌ల కోసంలైఫ్‌నే రిస్క్‌ చేస్తున్నారు. టిక్‌టాక్‌ కారణంతో ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమయ్యాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లారు. తాజాగా ప్రజాసేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్‌ ప్రపంచంలో మునిగి తేలడం వైరల్‌ అవుతోంది.రాష్ట్రంలో వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరీంనగర్‌ వైద్యశాఖలో ముగ్గురు మహిళలు టిక్‌టాక్‌ చేయడం… వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడం చర్చనీయాశమైంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి